తలో మూడు: సీట్లు పంచుకున్న కాంగ్రెసు, టిడిపి, వైయస్ జగన్

అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి కారణంగా టిడిపి అభ్యర్థి మెట్టు గోవిందారెడ్డి గెలిచారు. ఉభయ గోదావరి లో ఎలాగు టిడిపికి పట్టు ఉంది. ఇక కాంగ్రెసు శ్రీకాకుళం, ఎస్పీఎస్ నెల్లూరు, కర్నూలు జిల్లాలో, టిడిపి అనంతపురం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో, జగన్ వర్గం పశ్చిమ గోదావరి, కడప జిల్లాల్లో గెలుపొందగా చిత్తూరు జిల్లాలో ఒక్క ఓటు ఆధిక్యంలో ఉన్నప్పటికీ ప్రకటన పెండింగ్‌లో ఉంది. ఎట్టకేలకు జగన్ తన జిల్లాలో పట్టు నిలుపు కోవడంతో పాటు సిఎం కిరణ్‌కు ఆయన సొంత జిల్లాలో షాక్ ఇచ్చారు.
గెలుపొందిన అభ్యర్థులు-
కాంగ్రెసు - కర్నూలు - ఎస్వీ సుబ్బారెడ్డి, శ్రీకాకుళం - విశ్వప్రసాద్, నెల్లూరు - వాకాటి నారాయణరెడ్డి
టిడిపి - అనంతపురం - మెట్టు గోవిందరెడ్డి, ప.గో - అంగర రామ్మోహన్, తూ.గో. - బొడ్డు భాస్కరరావు
జగన్ వర్గం - కడప - నారాయణ రెడ్డి, ప.గో.- మేకా శేషుబాబు, చిత్తూరు - తిప్పారెడ్డి(చిత్తూరులో ప్రకటన పెండింగ్‌లో ఉంది)