మొన్న చిందేసిన కాంగ్రెసు నేత గంగా భవాని నేడు ఏడ్చింది
Districts
oi-Srinivas G
By Srinivas
|
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా నుండి కాంగ్రెసు పార్టీ తరఫున శాసనమండలి అభ్యర్థిగా బరిలో నిలిచిన గంగాభవాని ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడి పోవడంతో బుధవారం ఏడ్చింది. ఎన్నికలలో తన గెలుపు తథ్యమని భావించిన గంగాభవాని అనుకోని విధంగా ఓటమి చెందడంతో జీర్ణించుకోలేక ఆమె ఏడ్చింది. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన మేకా శేషుబాబు చేతిలో ఓడిపోయింది.
అయితే గంగాభవాని ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో సోమవారం పోలింగ్ కేంద్రం వద్దనే డాన్సు చేసి అందరినీ అలరించింది. జగన్ వర్గం వారు జై జగన్, జై వైయస్ఆర్ అంటుండటంతో ఉద్వేగం ఆపుకోలేక పోయిన గంగాభవాని కాంగ్రెసు పార్టీ కార్యకర్తలతో కలిసి డాన్సు చేసింది. తన విజయం ఖాయమన్నట్లుగా ఆమె ఆత్మవిశ్వాసంతో కనిపించింది. అనుకోని ఓటమిని మాత్రం ఆమె జీర్ణించుకోలక పోయింది.