రాజమండ్రి: పశ్చిమ గోదావరి జిల్లాలో అధికార కాంగ్రెసు పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. మొదటినుండి గెలుస్తామని అనుకున్న గంగాభవాని ఓటమి పాలయింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక సీటులో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన మేకా శేషుబాబు ఘన విజయం సాధించారు. జగన్ అభ్యర్థి 365 ఓట్లతో గెలిచారు. శేషుబాబు చేతిలో గంగాభవాని ఓటమి పాలయింది. కాగా జిల్లాలోని మరో సీటులో కూడా అధికార పార్టీకి దెబ్బ తగిలింది. రెండో స్థానం నుండి టిడిపి అభ్యర్థి అంగర రామ్మోహన్ గెలుపొందారు.
కాగా శ్రీకాకుళం నుండి మాత్రం కాంగ్రెసు అభ్యర్థి ప్రసాదు గెలుపొందారు. కర్నూలు జిల్లాలో కూడా కాంగ్రెసు అభ్యర్థి ఎస్వీ మోహన్ రెడ్డి 150 ఓట్లతో గెలిచారు. చిత్తూరు జిల్లాలో మాత్రం కాంగ్రెసు, జగన్ వర్గానికి నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. అయితే జగన్ వర్గం అభ్యర్థి కొద్దిగా ఆధిక్యంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తూర్పు గోదావరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచారు.