సిఎం ఆఫీసుపై జగన్ వర్గం ఫిర్యాదు: పెండింగులో ఫలితం

ఇలా ఒక ఓటరు రోమన్ అంకెలు, ఇంగ్లీషు అంకెలు వేయడాన్ని కాంగ్రెసు వారు ప్రశ్నించారు. ఒకే ఓటరు ఇలా రెండు రకాలుగా ఓటు వేయడాన్ని వారు ప్రశ్నించారు. జగన్ వర్గం వారు మాత్రం రీకౌంటింగ్ వద్దని పట్టుబట్టారు. దీంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జగన్ వర్గం నేత, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వర్గానికి బద్దశత్రువు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఓ సమయంలో ఆయన సొమ్మసిల్లి పడిపోయాడు. రీకౌంటింగ్‌కు నిరసనగా జగన్ వర్గం కార్యకర్తలు చిత్తూరు, పుంగనూరులో బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అయితే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎట్టకేలకు రీకౌంటిగ్ నిర్వహించి ఫలితాన్ని పెండింగులో పెట్టారు.












Click it and Unblock the Notifications