హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్తా చాటిన వైయస్ జగన్, కిరణ్ కుమార్ రెడ్డికి ఎదురు దెబ్బ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: శాసనసభ్యుల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు విజయం సాధించిన కాంగ్రెసు పార్టీ స్థానిక సంస్థల కోటా కింద జరిగిన ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బ తిన్నది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇది ఎదురు దెబ్బనే. వైయస్ జగన్ వర్గాన్ని దెబ్బ తీయడానికి కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీతో కలిసి వ్యూహరచన చేసినా ఫలితం కనిపించలేదు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో 9 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో జగన్ వర్గం తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలతో సమానంగా మూడు సీట్లు సాధించి సత్తా చాటింది. అయితే, పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ వర్గం అభ్యర్థి మేకా శేషుబాబు కాస్తా మంచి ఫలితమే సాధించినా, మిగతా రెండు చోట్ల చాలా కష్టపడి విజయం సాధించింది.

సొంత జిల్లా చిత్తూరులో కిరణ్ కుమార్ రెడ్డికి వైయస్ జగన్ వర్గం షాక్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసినా జగన్ వర్గం అభ్యర్థి తిప్పారెడ్డిని కాంగ్రెసు ఓడించలేకపోయింది. ఒక్క ఓటు తేడాతో జగన్ వర్గానికి చెందిన తిప్పా రెడ్డి గెలిచినట్లు తెలుస్తోంది. అయితే, ఫలితాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కాంగ్రెసు అభ్యర్థి కోరిక మేరకు రీకౌంటింగ్ జరుగుతోంది. దీంతో ఫలితం తారుమారవుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాగా, కడప జిల్లాలో జగన్ వర్గాన్ని కాంగ్రెసు పార్టీ నిలువరించలేకపోయారు. ముగ్గురు మంత్రులు మోహరించినా జగన్ వర్గాన్ని దెబ్బ తీయలేకపోయారు.

జగన్ వర్గం, కాంగ్రెసు మధ్య విభేదాలతో తెలుగుదేశం పార్టీ లాభపడినట్లు కనిపిస్తోంది. గతంలో ఈ 9 స్థానాల్లో ఎనిమిది స్థానాలు కాంగ్రెసు చేతిలో ఉండేవి. అయితే, మూడు సీట్లను మాత్రమే కాంగ్రెసు నిలబెట్టుకోగలిగింది. మూడు చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచింది. అనంతపురంలో కాంగ్రెసులోని విభేదాల వల్లనే తెలుగుదేశం అభ్యర్థి గెలిచారు. నెల్లూరులో కాంగ్రెసు అభ్యర్థి వాకాటి పాండురంగా రెడ్డి విజయం సాధించారు.

English summary
YS jagan camp succeeded in prooving its strength MLC elections. YS Jagan camp won 3 MLC seats out of Nine. YS Jagan camp candidate Tippa Reddy won in CM Kiran Kumar Reddy's district Chittoor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X