మే 14న మిధునరాశిలోకి శుక్రుడు.. వీరి పంట పండుతుంది!
దృక్ పంచాంగం ప్రకారం రాక్షసుల గురువైన శుక్రుడు మే 14వ తేదీన మిధున రాశిలోకి సంచారం చేస్తాడు. నవగ్రహాలలో శుక్రుడికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సంపదలకు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు మే 14వ తేదీన మిధున రాశిలోకి సంచారం చేయడం ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది .
బుధుడి రాశిలోకి శుక్రుడు
శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉంటే ఆయా రాశుల వారికి కలిసి వస్తుంది. రాజభోగాలు ప్రాప్తిస్తాయి. అదే శుక్రుడు నీచ స్థితిలో ఉంటే ఆయా రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కూడా వస్తాయి. ఇక మే 14వ తేదీన శుక్రుడు బుధుడి రాశి అయిన మిధున రాశిలోకి సంచరించడం వలన లబ్దిపొందే రాశులను గురించి తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారికి శుక్రుడు మిధున రాశిలోకి సంచారం చేయడం సానుకూల ఫలితాలను ఇస్తుంది. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ప్రస్తుతం కాస్త ఊరటను పొందుతారు. ఎక్కడైనా డబ్బు నిలిచిపోయిన, పెండింగ్లో ఉన్న కూడా ఈ సమయంలో వసూలవుతాయి .ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కొత్త బాధ్యతలను చేపట్టే అవకాశం ఉంది. ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
మిధున రాశి
మిధునరాశి జాతకులకు శుక్రసంచారం కారణంగా కలిసి వస్తుంది. శుక్రుడు నేరుగా మిధునరాశిలోకే ప్రవేశించడం వల్ల వీరికి సమయం అత్యంత విశేషమైనదిగా ఉంటుంది. మిధునరాశి జాతకులకు ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే, ఉద్యోగం మారాలనుకుంటే ఇది మిధున రాశి వారికి పూర్తి సహకారాన్ని అందిస్తుంది. నిర్ణయాలు తీసుకోవడంలో మిధునరాశి వారికి మంచి సమయం. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి, కళాకారులకు ఈ సంచారం ఎంతో మంచిది.
కుంభరాశి
కుంభరాశి జాతకులకు మిధున రాశిలో శుక్ర సంచారం కలిసి వస్తుంది. ఇది వీరికి అదృష్టాన్ని ఇస్తుంది. ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. ప్రేమ జీవితం గతంలో ఉన్న అపార్ధాలు తొలగిపోయి సంతోషంగా సాగుతుంది. విద్యార్థులకు, పోటీ పరీక్షలు రాసే వారికి ఇది మంచి సమయం. మిధున రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి.
గమనిక: వ్యక్తిగత జాతక స్థితుల ఆధారంగా ఫలితాలు మారవచ్చని, పూర్తి వివరాల కోసం నిపుణులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications