పార్టీ అధ్యక్షుడి హోదాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు

కాగా విజయనగరం జిల్లాలో చేపట్టనున్న ఓదార్పుయాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆ పార్టీ జిల్లా నేత, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు గురువారం విడుదల చేశారు. ఓదార్పుయాత్ర ఈ నెల 28న కొత్తవలస నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ యాత్ర వచ్చే నెల అంటే ఏప్రిల్ 5వ తారీఖున విజయనగరంలో ముగుస్తుందని అన్నారు.
జగన్ పార్టీ పెట్టిన తర్వాత తమ జిల్లా పర్యటనకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం శుభపరిణామమని సాంబశివరాజు అన్నారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications