వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చర్యలు తీసుకోండి: జగన్ వర్గం ఎమ్మెల్యేలపై ఎంపీల ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు పార్లమెంటు సభ్యులు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. స్థానిక శాసనమండలి ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ఓటమికి జగన్ వర్గం ఎమ్మెల్యేలే కారణమని వారు చెప్పినట్లుగా తెలుస్తోంది. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదముందని వారు హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.

కాగా లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌కు లేఖ రాశారు. అందులో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ప్రథమ స్థానంలో ఉంటుందని లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడినప్పటికీ ఆ ప్రభావం స్థానికంలో పడదని ఆయన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. మరో ఎంపీ కావూరి సాంబశివరావు కూడా ఎన్నికలలో ఓటమి, గెలుపులు సహజమే అని చెప్పారు. పలువురు ఎంపీలు జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలకు డిమాండ్ చేశారు. ఎంపీల ఫిర్యాదు తర్వాతనైనా అధిష్టానం స్పందిస్తుందో లేదో చూడాలి. కాగా జగన్ వర్గం కూడా ఫిర్యాదులకు భయపడేది లేదంటోంది.

English summary
Seemandhra MPs were complaint high command against Ex MP YS Jaganmohan Reddy camp MLAs today. They urged Azad to take action on MLAs who were going with Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X