జెసి దివాకర్ రెడ్డి, రఘువీరా ఫైట్: మల్లుభట్టి విక్రమార్క ఆంక్షలు

ఇకపై అనుమతి లేకుండా ఎవరూ సీఎల్పీలో మీడియా సమావేశం నిర్వహించరాదని చీఫ్‌విప్ మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రఘువీరా, జేసీలు అక్కడే మీడియా సమావేశాలు పెట్టి పరస్పరం విమర్శించుకున్న నేపథ్యంలో ఆయన ఈ ఆంక్షలు విధించారు. సీఎల్పీ వేదికగా సొంత పార్టీ నేతలను విమర్శించటం తగదని ఆయన అన్నారు. తన అనుమతిలేకుండా మీడియా సమావేశాలు పెట్టనివ్వద్దని ఆయన సిబ్బందిని ఆదేశించారు. మంత్రి రఘువీరా రెడ్డి, మాజీ మంత్రి జెసి దివాకర రెడ్డి మీడియా సమావేశాలు ఎలా పెట్టించారని సిబ్బందిపై ఆయన మండిపడ్డారు.












Click it and Unblock the Notifications