విజయ్ కే పట్టాభిషేకం: 120 +: Axis My India సంచలనం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఆక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాల తర్వాత అతిపెద్ద మార్పునకు తెర తీసింది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజం (TVK) భారీ విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఇది అధికార డీఎంకే కూటమికి ఊహించని ఎదురుదెబ్బ కావచ్చని భావిస్తున్నారు. విజయ్ ఈ ఎన్నికలలో పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానాల నుండి పోటీ చేశారు.

ఆక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం 234 నియోజకవర్గాల అసెంబ్లీలో టీవీకే 98 నుండి 120 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన 118 సీట్ల మెజారిటీ మార్కుకు టీవీకే చేరువలో ఉంది. అధికారంలో ఉన్న డీఎంకే నేతృత్వంలోని కూటమి 92 నుండి 110 స్థానాలకు పరిమితం కాగా, అన్నాడీఎంకే కూటమి 22 నుండి 32 స్థానాలను మాత్రమే దక్కించుకోవచ్చని ఈ సర్వే అంచనా వేసింది.

Vijay TVK Poised for Power as Majority Hovers Around 118 to 120 Seats Axis My India Exit Poll

ఆక్సిస్ మై ఇండియా అంచనాలు నిజమైతే, విజయ్ తొలి అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడు రాజకీయ చరిత్రలో కీలక మలుపు అవుతాయి. దశాబ్దాల డీఎంకే, అన్నాడీఎంకే ఆధిపత్యాన్ని టీవీకే సవాల్ చేస్తోంది. ఈ సర్వే ప్రకారం, టీవీకే ఒక నూతన శక్తిగా ఎదిగింది. ఈ ఎన్నికలు.. టీవీకేను అతిపెద్ద పార్టీగా నిలబెట్టొచ్చని లేదా అధికారం చేపట్టే స్థాయి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఒక ప్రాంతీయ పార్టీకి మొదటి ఎన్నికల్లో ఇది చరిత్ర సృష్టించే ప్రదర్శన కాబోతోందని యాక్సిస్ మైఇండియా అభిప్రాయపడింది.

విజయ్ రాకతో ఏర్పడిన ఈ త్రిముఖ పోరులో డీఎంకే కూటమి బలమైన స్థానాలను సైతం కోల్పోయే ప్రమాదం ఉంది. అన్నాడీఎంకే మూడో స్థానానికి పరిమితం కావొచ్చు. ఆక్సిస్ మై ఇండియా టీవీకేకు భారీ ఆధిక్యాన్ని అంచనా వేయగా, ఇతర ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ శాతం డీఎంకే కూటమికే మొగ్గు చూపాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం, డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ 125 నుండి 145 స్థానాలతో మెజారిటీ మార్కును సునాయాసంగా దాటే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+