Assam Exit Poll 2026: అసోంలో జరిగేది ఇదే.. చాణక్య సర్వే సంచలనం..!
అసోంలో బీజేపీ కూటమి దూసుకెళ్తోంది. అసోంలోని 126 స్థానాలకు ఏప్రిల్ 9 న ఓటింగ్ జరిగింది. అయితే అసోం ఎన్నికలపై చాణక్య స్ట్రాటజీస్ సర్వే కీలక అంచనాలను వెల్లడించింది. ఈ సర్వేలో ఎన్డీఏ కూటమికి 88 నుంచి 98 స్థానాలు వస్తాయని తేల్చింది. అలాగే కాంగ్రెస్ కూటమికి 25 నుంచి 32 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఇక ఇతరులకు 6 నుంచి 12 స్థానాలు వస్తాయని స్పష్టం చేసింది. 2021 లోనూ అసోంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చాణక్య స్ట్రాటజీస్ సంస్థ అంచనా వేసింది. ఎన్డీఏ కూటమికి 70 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. అలాగే రాష్ట్రంలో 43 శాతం ఓట్లు ఎన్డీఏకే దక్కుతాయని స్పష్టం చేసింది.
ఇక మహజోత్ కూటమికి 56 స్థానాలు దక్కుతాయని పేర్కొంది. 40 శాతం ఓట్లు ఈ కూటమికి వస్తాయని అంచనా వేసింది. అలాగే ఇతరులకు 0 నుంచి 3 సీట్లు దక్కుతాయని పేర్కొంది. ఈ మేరకు ఇతరులకు 17 శాతం ఓట్లు వస్తాయని స్పష్టం చేసింది. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి 75 స్థానాలు కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా అసోం ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఇక మే 4 న ఫలితాలు వెల్లడికానున్నాయి. 2026 ఎన్నికల్లో అసోంలో రికార్డు స్థాయిలో 85.8 శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలోనే ఇదే అత్యధికం కావడం విశేషం.

ఇక అసోంకు సంబంధించి జేవీసీ సర్వే వివరాలు చూస్తే బీజేపీ కూటమి 88 నుంచి 101 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేస్తోంది. అలాగే కాంగ్రెస్ కూటమి 23 నుంచి 33 స్థానాల్లో విక్టరీ కొడుతుందని స్పష్టం చేసింది. ఇక ఇతరులు 0 నుంచి 5 సీట్లు సాధించే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే పోల్ డెయిరీ సర్వే విషయానికి వస్తే.. అసోంలో బీజేపీ కూటమి 86 నుంచి 101 స్థానాల్లో గెలుపొందుతుందని పేర్కొంది. అలాగే కాంగ్రెస్ కూటమి 15 నుంచి 26 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇతరులు 3 నుంచి 7 స్థానాల్లో గెలుస్తారని పేర్కొంది.












Click it and Unblock the Notifications