వ్యక్తుల వెంట పార్టీ నడవదు: జగన్‌కు కిరణ్ చురక

పార్టీలో కార్యకర్తలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని సిఎం అభిప్రాయపడ్డారు. కార్యకర్తలను ప్రోత్సహించాలన్నారు. పార్టీకి కార్యకర్తలే ప్రాణం అని అన్నారు. కార్యకర్తలను విస్మరిస్తే పార్టీ దెబ్బతింటుందన్నారు. కార్యకర్తలు లేకుంటే ఏ పార్టీ ఉండదన్నారు.డిఎస్ పార్టీలో మరింత ఎదగాలని ఆయన అన్నారు. డిఎస్‌కు ఇంతకంటే పెద్ద పదవి రావాలని అన్నారు. పార్టీ వెంటే కార్యకర్తలు ఉంటారన్నారు. కార్యకర్తలు, నేతలు కష్టపడితే విజయం ఖచ్చితంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ గెలుపోటములు ప్రతి మనిషికి సహజమన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సాధారణమే అని అన్నారు. పార్టీకి డిఎస్ చేసిన సేవలు మరువలేనివన్నారు. డిఎస్ పిసిసి అధ్యక్షుడిగా అద్భుతంగా రాణిస్తున్నారని కితాబిచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ డిఎస్ వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నారని అన్నారు. డిఎస్ మరింత ఎదగాలని ఆయన కోరుకున్నారు.