బెట్టింగుకు పాల్పడుతున్న బూకీతో సహా మాజీ నిర్మాత కుటుంబం అరెస్టు!

అస్ట్రేలియాపై గెలిచి సెమీ ఫైనల్‌కు చేరిన భారత్ సెమీ ఫైనల్లో దాయాది జట్టు పాకిస్తాన్‌తో పోరుకు దిగుతున్నందున బెట్టింగుల జోరు అందుకుంది. భారత్-పాక్ జట్ల మధ్య పోరు కావడంతో బెట్టింగు చాలామంది పాల్పడే అవకాశముందని గుర్తించిన పోలీసులు ఓ కన్ను వేస్తున్నారు. దీనిలో భాగంగా విక్కీని అరెస్టు చేశారు. విక్కీ కింద నగరంలో సుమారు వందమంది ఫాంటర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా విక్కీకి నెట్ వర్క్ ఉందని పోలీసులు భావిస్తున్నారు.
విక్కీ సుమారు రూ.5 కోట్లనుండి 10 కోట్ల రూపాయల మేరకు బెట్టింగులకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో విక్కీ ఓ రూంలో ఉండి లాప్‌టాప్ ద్వారా బెట్టింగులు నిర్వహించే వాడని తెలుస్తోంది. ఇప్పుడు ఫాంటర్లను నియమించుకొని నేరుగా బెట్టింగు చేసే వ్యక్తుల ఇళ్లకు పంపిస్తున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications