సెజ్‌లకు వక్ఫ్ భూములు కేటాయిస్తారా?: అక్బరుద్దీన్ ఓవైసీ ధ్వజం

అనంతపురం జిల్లాలో వక్ఫ్ భూమికి చెందిన 3300 ఎకరాలు, హిందుపూర్‌లో 3500 ఎకరాల వక్ఫ్‌భూమిని సెజ్‌ల కోసం కేటాయించారని ఆయన సభకు తెలిపారు. ప్రభుత్వభూమిని ఇష్టానుసారంగా పంచారని, అవి ఏ లక్ష్యంతో కేటాయించారో వాటి అడ్రస్ కూడా లేదని, వక్ఫ్‌భూములను ఎవరికిబడితే వారికి ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం 50 వేల ఎకరాలకు పైగా సంస్థలకు కేటాయించిందని ఆయన అన్నారు. శంషాబాద్ విమానాశ్రయం కోసం వక్ఫ్ భూమిని కేటాయించారని, అక్కడి మసీదును తిరిగి కట్టిస్తామని దివంగత ముఖ్యమంత్రి వైయస్ హామీ ఇచ్చారని, ఆ హామీ అమలు కాలేదని ఆయన అన్నారు.