ఏం చేశాం, ఏం చేయాలి: ముప్పయ్యేళ్ల టిడిపిపై చంద్రబాబు

టిడిపి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిందన్నారు. వచ్చే మహానాడు వరకు పార్టీ విధివిధానాలు నిర్ణయించి ప్రజలలోకి తీసుకు వెళ్లే కార్యక్రమాలు చేపడతామన్నారు. తెలుగువారి గురించి ప్రపంచానికి చాటి చెప్పింది తెలుగుదేశం పార్టీయే అన్నారు. టిడిపి జెండా బడుగు బలహీన వర్గాలకు అండ అన్నారు. సామాజిక న్యాయం, ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకు వచ్చింది తెలుగుదేశం పార్టీయే అన్నారు. నేటి నుండి వచ్చే సంవత్సరం మహానాడు వరకు 14 నెలల పాటు పెద్ద ఎత్తున ప్రజలలోకి వెళ్లేందుకు కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఎన్టీఆర్ ఏ ఉద్దేశ్యంతో పార్టీ పెట్టారో ఆ ఆశయాలు నెరవేర్చడానికి కార్యకర్తలు, నేతలు కలిసి పని చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications