హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీలో దాడి చేసిన వివేకాపై చర్యలేవి: ఈటెల రాజేందర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Etela Rajender
హైదరాబాద్: ఉప సభాపతి నాదెండ్ల మనోహర్ ఎదురుగానే ఓ మంత్రి శాసనసభలో శాసనసభ్యునిపై దాడి చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్ మంగళవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఖండించారు. నాదెండ్ల తీరు ఓ ప్రాంతానికో ఓ న్యాయం, మరో ప్రాంతానికి మరో న్యాయం అన్నట్లుగానే ఉందన్నారు. శాసనసభలో స్వయంగా మంత్రులే దాడి చేయడం శోచనీయమన్నారు. శాసనసభలు ప్రారంభ సమయంలో మా డ్రైవర్ మల్లేష్ దాడి చేశారని ఆయనకు శిక్ష విధించారని, తాము కూడా స్పీకరు ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని చెప్పారు.

అయితే మాకో న్యాయం వివేకానందరెడ్డికి ఓ న్యాయమా అని ప్రశ్నించారు. నాదెండ్ల తీరు ప్రాంతానికో న్యాయం అన్న చందంగా ఉందన్నారు. స్పీకరు ముందే వివేకా ఎమ్మెల్యేలపై దాడి చేస్తే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి ప్రాంతీయ విభేదాలు చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే మాకు న్యాయం జరుగుతుందనేది స్పష్టం అవుతుందన్నారు.

English summary
TRSLP Etela Rajender questioned deputy speaker Nadendla Manohar attitude. He condemned YS Vivekananda attack on TDP MLAs. He demanded to take action on YS Vivekananda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X