వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పేదవాడి కోసం దివంగత వైయస్ పథకాలు: ఓదార్పులో జగన్

లంకపట్నంలో మొదట జగన్ దివంగత వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి సామాన్యుని గుండెల్లో వైయస్ ఉన్నారన్నారు. ప్రతి మహిళ తన కాళ్లపై తాను నిలబడాలనే ఉద్దేశ్యంతో పావలా వడ్డీ పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. ప్రతి ఒక్క కుటుంబం నుండి ఒక్కరన్నా చదువాలనే ఉద్దేశ్యంతో ఫీజు రీయింబర్సుమెంట్సు ప్రవేశ పెట్టారన్నారు. 108, ఆరోగ్యశ్రీలను వైయస్ ప్రవేశ పెట్టి పేదవారికి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు.