హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వాధినేత తనయుడికి యాభై శాతం వాటా: జెపి ధ్వజం

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayana
హైదరాబాద్‌: ముందు వచ్చినవారికి ముందు అనే ప్రాతిపదికపై కోట్లాది రూపాయల విలువ చేసే గనులను అప్పన్నంగా కట్టబెట్టారని, అలా కట్టబెట్టినందుకు ఆయా సంస్థల్లో ప్రభుత్వాధినేత తనయుడికి యాభై శాతం వాటా దక్కిందని లోకసత్తా శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ ఆరోపించారు. భూ కేటాయింపులపై శాసనసభలో ఆయన మంగళవారం ప్రసంగిస్తూ భూముల కేటాయింపు వ్యవహారంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. అవినీతి ఉందని ఆదాయం పన్ను శాఖ గుర్తించిన తర్వాత చర్యలు తీసుకోవడం జాప్యం వద్దని ఆయన అన్నారు. భూకేటాయింపులపై సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని, వివిధ సంస్థలకు చెందిన భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బహిరంగ వేలంలోనే భూములను వివిధ సంస్థలకు అప్పగించాలని ఆయన కోరారు.

ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, అధికార దుర్వినియోగం, అవినీతులతో పేదల భూములను బలవంతంగా లాక్కున్నారని ఆయన అన్నారు. భూ కేటాయింపుల ద్వారా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన కంపెనీలు నష్టాల్లో ఉన్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయని ఆయన అన్నారు. నష్టాల్లో ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి, భూ కేటాయింపులకు సంబంధం ఉందని ఆయన అన్నారు. భూతద్దం పెట్టినా కనిపించని దేశానికి చెందిన రస్ ఆల్‌ఖైమా కంపెనీతో ప్రమాణాలు పాటించకుండా ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ఆయన చెప్పారు. వోక్స్ వ్యాగన్‌కు అప్పన్నంగా పది కోట్ల రూపాయలు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. 2010 వరకు 320 కోట్ల నష్టాల్లో ఉన్న కంపెనీలో రస్ ఆల్‌ఖైమా సంస్థ పెట్టుబడులు పెట్టిందని ఆయన చెప్పారు.

కాకినాడ కంపెనీతో ఓఎన్‌జిసి ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పంద పత్రంపై ప్రైవేట్ వ్యక్తి సంతకం చేశారని ఆయన చెప్పారు. ఒప్పందాలు ఎలా జరుగుతాయో, ఎలా చేసుకోవాలో కూడా తెలియకుండా ఒప్పందాలు జరిగాయని ఆయన అన్నారు. రైతులను బెదిరించి కాకినాడ సీపోర్టు రైతుల నుంచి భూములను సేకరించిందని ఆయన విమర్శించారు. విశాఖలోని బ్రాండిక్స్‌కు వేయి ఎకరాలు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఫ్యాబ్ సిటీకి 1070 ఎకరాలు ప్రమాణాలు పాటించకుండా కేటాయించారని ఆయన ఆరోపించారు. విఐపిలకు, విల్లాలకు విలువైన భూములను కట్టబెట్టారని ఆయన ఆరోపించారు.

English summary
Loksatta MLA Jayaprakash Narayana alleged that land allocations were done with get favour to ruling party bigwig's son. He said that natural resources were robbed indiscriminately to get favour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X