సమైక్య రాష్ట్రంలో ప్రాంతాల వారిగా న్యాయం: పోచారం శ్రీనివాస్ రెడ్డి

సమైక్య రాష్ట్రంలో ప్రాంతాల వారిగా న్యాయం జరుగుతున్నట్టుగా కనిపిస్తోందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ ప్రజలు, విద్యార్థులు అత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన ఈ సందర్భంగా కోరారు. తెలంగాణ సాధించుకునే వరకు అందరం కలిసి పోరాడుదామన్నారు. కాగా తన రాజీనామాను ఆమోదించాలని నాదెండ్ల మనోహర్‌ను కలిసి పోచారం శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం టిఆర్ఎస్‌తో కలిసి ఉద్యమాన్ని ఉధృతంగా చేయడానికే రాజీనామా చేసినట్టు చెప్పారు.