వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాలర్ పట్టుకొని అడగలేరా: ఓదార్పులో టిడిపిపై వైయస్ జగన్ నిప్పులు

సామాన్యుల సంక్షేమ పథకాలను ప్రభుత్వం నీరు గారుస్తున్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం చూస్తూ కూర్చుందని అన్నారు. వైయస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఎందుకు ప్రవేశ పెట్టడం లేదని ప్రభుత్వం కాలర్ పట్టుకొని అడగాల్సిన టిడిపి ఆ పని మాత్రం చేయడం లేదన్నారు. కాంగ్రెసు, టిడిపి పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని తనను దెబ్బతీయాలని చూస్తున్నాయని ఆరోపించారు. ప్రజలే వారికి బుద్ది చెబుతారని ఆయన అన్నారు.
కాగా వరంగల్ జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మహబూబాబాద్‌లో మంగళవారం దివంగత వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. మహబూబాబాద్‌కు పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడం ఆనందంగా ఉందన్నారు.