పది కోట్లకు పడగలెత్తిన అధికారి: ఎసిబి సోదాల్లో బయటపడిన నిజం

గురువారం ఉదయం నుండే గుంటూరులోని ఆయన ఇంటిపై అధికారులు దాడులు ప్రారంభించారు. మోహన్ రావు బంధువుల ఇళ్లపై కూడా అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాదు, గుంటూరు జిల్లాలో భారీగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న పత్రాలు వారు కనుగొన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాదులోని అమీర్‌పేటలోని సాయి రెసిడెన్సీలో ఓ ఫ్లోర్, మరో ఆరు ఫ్లాట్లు, గుంటూరులోని మల్లికార్జున నగరం తదితర ప్రాంతాలలో విలువైన భూములు ఉన్నట్లు అధికారులు కనుగొన్నట్లుగా తెలుస్తోంది. అయితే వాటి విలువ రూ.50 లక్షలు ఉండవచ్చుననే అంచనాకు వచ్చినప్పటికీ పది కోట్ల వరకు ఉంటుందని అంచనా కూడా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. నాలుగు టీంలో ఏక కాలంలో ఆయన ఇంటిపై, బంధువుల ఇళ్లపై దాడులు నిర్వహించింది.