పులివెందుల, కడప ఉప ఎన్నికలపై చంద్రబాబు కసరత్తు

వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జరిగిన ఉప ఎన్నికలో వైయస్ విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి తెలుగుదేశం పార్టీ సహకరించింది. తమ పార్టీ అభ్యర్థిని పోటీకి దించలేదు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. మారిన పరిస్థితి నేపథ్యంలో రెండు సీట్లలోనూ పార్టీ అభ్యర్థులను పోటీకి దించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై ఆయన గురువారంనాటి సమావేశంలో చర్చించినట్లు సమాచారం. వైయస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడు వైయస్ జగన్ అవినీతిని ప్రచారాస్త్రం చేసుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.