ఏ వయస్సు వారు ఎంత సేపు రోజూ వాకింగ్ చేయాలో తెలుసా..!?

వాకింగ్ చేయటం ఎంతో అవసరం. అన్ని వయసుల వారికీ శారీరంగా మేలు చేసే ఎక్సర్ సైజ్. వైద్యులు సైతం రోజూ వాకింగ్ చేయటం గురంచి అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. కానీ వాకింగ్ చేయడానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. మీ వయస్సుకి తగ్గట్టుగా.. మీ శరీర బరువుకు తగ్గట్టుగా నడక మొదలుపెట్టాలి. ఓవర్‌గా వాకింగ్ చేసినా, ఏదో పెళ్లికి వెళ్తున్నాం అన్నట్లుగా స్లోగా చేసిన నష్టమే జరుగుతుంది. ఏ వయసు వారు ఎంత సేపు రోజూ వాకింగ్ చేయాలో నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

వాకింగ్ పవర్ ఫుల్ ఎక్సర్ సైజ్. ఏ వయసు వారైనా చేయచ్చు. ఈ రోజుల్లో చిన్న వయసులోనే గుండె జబ్బులు, అధిక ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. అయితే వీటిని తగ్గించడానికి చాలా సులభమైన మార్గం ఉంది. రోజూ కేవలం 1 కిలోమీటరు వాకింగ్‌ చేసినా శరీరం, మనసు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ చిన్న అలవాటు గుండె ఆరోగ్యం నుంచి బరువు నియంత్రణ వరకు అనేక ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు. 18 నుంచి 30 ఏళ్ల వయస్సు వాళ్ళు రోజు 30 నుంచి 60 నిమిషాల వాకింగ్ చేయవచ్చు. 30 నిమిషాలకు తగ్గితే అది శరీరంపై ఏమాత్రం ప్రభావం చూపించదు. అలాగని 60 నిమిషాల తర్వాత కూడా వాకింగ్ చేస్తే అలసటకు గురవుతారు. కానీ బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం రోజు 10 నిమిషాల నుంచి మొదలుపెట్టి 30 నిమిషాల వరకు పది రోజుల్లో ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

షర్మిలకు రాజ్యసీటు సీటు అడ్డుకుందెవరు, చివరి నిమిషంలో..!!
షర్మిలకు రాజ్యసీటు సీటు అడ్డుకుందెవరు, చివరి నిమిషంలో..!!
walking-wards-off-heart-disease-brings-up-the-heart-rate-lowers-blood-pressure-and-strengthens-the

నిపుణుల సూచనలు

కాగా, ఇక 31 నుంచి 50 సంవత్సరాల వయసున్న వారు కనీసం 30 నిమిషాలు గరిష్టంగా 45 నిమిషాలు చేయాలి. ఈ వయసులో రెగ్యులర్‌గా వాకింగ్ చేయడం వల్ల బరువు కంట్రోల్‌లో ఉంటుంది. రోజూ నడవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ స్థాయులు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. నడిచేటప్పుడు శరీరంలో ఎండార్ఫిన్స్‌ అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మనసుకు ప్రశాంతతను కలిగించి ఒత్తిడి, ఆందోళన, మానసిక అలసటను తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ వాకింగ్ అలవాటు చేసుకుంటే జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలు తగ్గి జీవక్రియ వేగవంతం అవుతుంది. నడక శరీరానికి సహజమైన వ్యాయామంలా పనిచేస్తుంది. నిద్రలేమి సమస్య కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సమతుల్య ఆహారంతో పాటు రోజూ వాకింగ్ అలవాటు చేసుకుంటే బరువు నియంత్రణ లో ఉంటుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. 66 నుంచి 75 ఏళ్ల వయసున్న వృద్ధులు 20 నిమిషాలు వాకింగ్ చేస్తే సరిపోతుంది. ఇలా ఓ పద్ధతి ప్రకారం వాకింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+