ఆ రైలెక్కాలంటే రెండు బకెట్ల నీళ్ళు తీసుకెళ్ళాల్సిందే.. లేదంటే చుక్కలే!

విశాఖపట్నం నుంచి దూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లలో ప్రయాణికులు ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. రైలు టాయిలెట్స్ లో నీళ్లు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కొన్ని బోగీల్లోనే నీరు అందుబాటులో ఉండి మరికొన్నింటిలో పూర్తిగా లేకపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది.

చేతులు కడుక్కోవడానికి కూడా నీరు దొరకకపోవడంతో కొందరు స్టేషన్లలో నీళ్ల సీసాలు కొనుగోలు చేసి అవసరాలు తీర్చుకోవాల్సి వస్తోంది. ఇటీవల విశాఖ నుంచి బయలుదేరిన విశాఖ-మహబూబ్‌నగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లో ఈ సమస్య తీవ్రంగా కనిపించింది. అనకాపల్లి దాటక ముందే పలు బోగీల్లోని టాయిలెట్స్ లో నీరు లేక ప్రయాణికులు నానా నరకయాతన పడ్డారు. వారు ఒక బోగీ నుంచి మరో బోగీకి టాయిలెట్ లలో నీళ్ళ కోసం తిరగాల్సి వచ్చింది.

railway news Passengers Face Severe Hardship Due to Water Shortage in Toilets on Trains from Visakhapatnam

కొందరు రైల్వే అత్యవసర సేవలకు ఫోన్ చేసి నీళ్లు ఎక్కడ దొరుకుతాయో అడగాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు తరచూ ఎదురవుతుండటంతో సోషల్ మీడియాలో ప్రయాణికులు పోస్టులు పెడుతున్నారు ప్రయాణికులు "లగేజీతో పాటు రెండు బకెట్ల నీళ్లు కూడా తీసుకెళ్లాల్సి వస్తోంది" అని వాపోతున్నారు. విశాఖపట్నం నుంచి బయలుదేరే రైళ్లలో సాధారణంగా విశాఖలో బోగీలకు నీరు నింపుతారు.

సాధారణంగా 300 కిలోమీటర్ల వరకు నీటి కొరత ఉండకూడదు. గతంలో ఈ రైలుకు విజయవాడలో మళ్లీ నీళ్ళు నింపేవారు. కానీ ప్రస్తుతం ఈ రైలు విజయవాడ ద్వారా కాకుండా రాయనపాడు బైపాస్ మీదుగా కాజీపేట వైపు వెళ్లడంతో మధ్యలో నీరు నింపే అవకాశం లేదు. రాజమహేంద్రవరం వంటి ప్రధాన స్టేషన్లలో నీరు నింపే ఏర్పాటు చేస్తే సమస్యకు కొంత ఉపశమనం లభిస్తుందని ప్రయాణికులు సూచిస్తున్నారు.

నీటి సమస్య దృష్ట్యా సిబ్బంది వాల్వ్ లను ఆపేసి ఉంచుతున్నారని ప్రయాణికులు చెప్తున్నారు. సిబ్బందిని అడిగితేనే, అవసరమైనప్పుడు మాత్రమే తెరుస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. దీనివల్ల కొన్ని బోగీల్లో నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంటోంది. రైల్వే శాఖ ప్రకారం సౌత్ కోస్ట్ రైల్వే నెట్‌వర్క్‌లో తాగునీరు సురక్షితంగా ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ, బోగీల్లోని నీటి ట్యాంకుల సామర్థ్యం, నింపే వ్యవస్థలో లోపాలు ఉన్నాయని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు.

తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్‌లో వందేభారత్‌తో పాటు మరిన్ని రైళ్లకు హాల్ట్.. కేంద్రమంత్రి రిక్వెస్ట్!
తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్‌లో వందేభారత్‌తో పాటు మరిన్ని రైళ్లకు హాల్ట్.. కేంద్రమంత్రి రిక్వెస్ట్!

దూర ప్రయాణాల్లో 12 నుంచి 18 గంటలు పైగా సమయం పడుతుండటంతో మరుగుదొడ్లలో నీరు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ప్రత్యేకంగా వేసవి కాలంలో లేదా పండుగల సమయంలో రైళ్లు రద్దీగా ఉన్నప్పుడు ఈ కష్టం మరింత పెరుగుతుంది. ప్రయాణికులు రైల్వే హెల్ప్‌లైన్ 139కి ఫిర్యాదు చేయవచ్చని, స్టేషన్ మాస్టర్ లేదా ట్రైన్ టికెట్ ఎగ్జామినర్‌కు సమస్యను తెలియజేయవచ్చని అధికారులు సూచిస్తున్నారు. కానీ చాలా మంది ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చెయ్యాలని రైల్వే అధికారులను కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+