సుప్రీం అసాధారణ నిర్ణయం..! కోర్టు ధిక్కారంపై ఆదివారం విచారణ..!

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్ధి సంఘాలు చేపట్టిన నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భారీ ఎత్తున ఆంక్షలు విధించారు. మెట్రో స్టేషన్లను పూర్తిగా మూసేయడంతో పాటు రోడ్లనూ ఎక్కడికక్కడ బ్యారికేడ్లతో దిగ్బంధించారు. రెండు రోజుల క్రితమే మొదలైన ఈ ఆంక్షలపై సుప్రీంకోర్టు నిన్న జోక్యం చేసుకుంది. లాయర్ కపిల్ సిబల్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. నిరసనలను కట్టడి చేసే పేరుతో పూర్తిగా ఆంక్షలు విధించవద్దని ఆదేశాలు ఇచ్చింది. అయినా ఇవాళ ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఆంక్షలు కొనసాగించారు.

భయం ఉంటే ఏకంగా 'దేశాన్నే బంద్' చేయండి.. కేంద్రంపై సీజేపీ సెటైర్లు!
భయం ఉంటే ఏకంగా 'దేశాన్నే బంద్' చేయండి.. కేంద్రంపై సీజేపీ సెటైర్లు!

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన జరిగిందని ఆరోపిస్తూ దాఖలైన ధిక్కార పిటిషన్ పై రేపు ఆదివారం సెలవు దినమైనా ప్రత్యేక విచారణ నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) నిర్ణయించింది. న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించినందుకు కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ డి.తారాలపై ధిక్కార చర్యలు తీసుకోవాలని ఈ పిటిషన్‌లో కోరారు.

Delhi Protest Curbs Supreme Court Schedules Special Sunday Hearing on Plea
CJP Protest: ఢిల్లీలో ఆంక్షలపై సుప్రీం ఫైర్..! భద్రత పేరుతో మూసేస్తారా ?
CJP Protest: ఢిల్లీలో ఆంక్షలపై సుప్రీం ఫైర్..! భద్రత పేరుతో మూసేస్తారా ?

ఢిల్లీ నిరసనల సమయంలో మెట్రో, రైల్వే సర్వీసులను పూర్తిగా నిలిపివేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, అధికారులు ప్రజా రవాణాపై ఆంక్షలు విధించడం కొనసాగించారని పిటిషనర్ ఆరోపించారు. మెట్రో స్టేషన్లను నిరంతరం మూసివేయడం, రైళ్లను రద్దు చేయడం వల్ల ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలగడంతో పాటు జాతీయ రాజధానిలో ప్రజా జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై విచారణ జరిపి అధికారులపై ధిక్కార చర్యలు తీసుకోవాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరుతున్నారు. సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా 57 మెట్రో స్టేషన్లను మూసివేయాలని, న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లకు వచ్చే మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లపై ఆంక్షలు విధించాలని ఢిల్లీ పోలీసులు జారీ చేసిన ఆదేశాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. చివరికి ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ ఈ మూసివేతను 45 మెట్రో స్టేషన్లకు తగ్గించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+