రూ.10 నాణేలతో టూవీలర్ కొనుగోలు చేసిన వ్యక్తి.. కారణం ఇదే..!

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్ లైన్ పేమెంట్స్ కనిపిస్తున్నాయి. వీధి వ్యాపారుల దగ్గర్నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకూ అందరూ యూపీఐ పేమెంట్స్ ను వినియోగిస్తున్నారు. గతంలో జేబులో పర్సు అందులో డబ్బులు పెట్టుకుని వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు పూర్తిగా క్యాష్ లెస్ లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ కాలంలోనూ ఓ వ్యక్తి రూపాయి రూపాయి పోగేసి టూ వీలర్ కొనుగోలు చేశాడు. ఈ అరుదైన ఘటన మంచిర్యాల జిల్లాలో లక్సెట్టిపేట మండలంలో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన పాస్టర్ జోసెఫ్ వినూత్నంగా ఆలోచించాడు.

అందరిలా తాను ఆన్ లైన్ పే మెంట్ ద్వారా ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయకూడదని భావించాడు. అలాగే రూ. 100, రూ. 500 నోట్లతోనూ టీ వీలర్ కొనుగోలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అలా కేవలం రూ. 10 రూపాయల నాణెలను పొదుపు చేయడం ప్రారంభించాడు. అలా మూడేళ్ల పాటు రూ. 10 నాణెలను పొదుపు చేస్తూనే ఉన్నాడు. అలా పొదుపు చేసుకున్న రూ. 10 నాణేలతో కొత్త బైక్ కొనుగోలు చేశాడు. లక్సెట్టిపేట మండలానికి చెందిన పాస్టర్ రవి జోసెఫ్ చేసిన ఈ ప్రయత్నం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అందరూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక్కో రూపాయి పొదుపు చేసి తన కలను నిజం చేసుకోవడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. రవి జోసెఫ్ ఓ పాస్టర్. ఆయనకు బైక్ కొనుగోలు చేయాలని కోరిక ఉంది. కానీ ఓ కండీషన్ పెట్టుకున్నాడు. ఆన్ లైన్ ట్రాన్స్ శాంక్షన్ , ఇతర విధాలుగా కాకుండా కేవలం రూ. 10 నాణేలతోనే తన కలను నెరవేర్చుకోవాలని అనుకున్నాడు. అలా రవి జోసెఫ్ గత మూడేళ్లుగా కిరాణా దుకాణాలు, ఇతర ప్రాంతాల్లో రోజువారీ లావాదేవీల ద్వారా వచ్చిన రూ.10 నాణేలను జాగ్రత్తగా దాచుకున్నాడు. దాని విలువ మొత్తం రూ.1.23 లక్షలకు చేరింది.

Mancherial A rare incident in Mancherial district a man purchased a two-wheeler using 10 coins

దాంతో ఆ నాణేలన్నింటినీ తీసుకుని బైక్ షోరూమ్‌ కు వెళ్లి కొత్త ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు రవి జోసెఫ్. అయితే రూ.1.23 లక్షల విలువైన రూ. 10 నాణేలను లెక్కించడం షోరూమ్ సిబ్బందికి కాస్త ఇబ్బందిగానే అనిపించింది. సుమారు రెండు గంటలపాటు శ్రమించి మొత్తానికి నాణేల విలువను లెక్కించారు. ఇక ఈ ప్రక్రియకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+