ఇక వంద కోట్లు కాదు 121 కోట్లు: అధిక జనాభాగల రాష్ట్రాల్లో ఎపి
National
oi-Srinivas G
By Srinivas
|
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం గురువారం భారత జనాభా గణాంకాలను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత దేశ జనాభా 121 కోట్లకు చేరింది. ఖచ్చితంగా అంటే 121,01,93,422 జనాభా ఉంది. ఇందులో పురుషులు 62,37,24,246 కోట్లు కాగా, మహిళలు 58,64,69,179గా ఉన్నారు. ఈ పదేళ్లలో జనాభా 18 కోట్లు పెరిగినట్లుగా తెలిపింది. అతి తక్కువ పెరుగుదల గల దశాబ్దం ఇదే కావడం జనాభా పెరుగుదలను తగ్గించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు సఫలం చెందుతున్నాయనడానికి నిదర్శనం. అధిక జనాభా కలిగిన రాష్ట్రాలలో మన రాష్ట్రం కూడా ఉంది.
మన రాష్ట్ర మొత్తం జనాబా 8,46,65,533కు చేరుకుంది. అయితే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా మాత్రం ఉత్తర ప్రదేశ్ నిలిచింది. ఇక నాగాలాండులో జనాభా తగ్గడం విశేషం. స్త్రీల జనాభా 18 శాతం పెరగడం విశేషం. పురుషుల జనాభా 17 శాతం పెరిగింది. కాగా అత్యధిక జనాభా కలిగిన నగరంగా థానే మొదటి స్థానంలో నిలిచింది.
Central government released Indian population counting today. Population ratio decreased this decade. Uttar Pradesh is in first place in population. Our state population is 8,46,65,533.
Story first published: Thursday, March 31, 2011, 11:16 [IST]