హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలపై చర్యలకు పెరుగుతున్న ఒత్తిడి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కడప జిల్లా శాసనసభ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెసు జిల్లా నాయకులు వైయస్సార్ కాంగ్రెసుకు చెందిన శాసనసభ్యులకు, తమకు మధ్య విభజన రేఖ కచ్చితంగా ఉండాలని, అప్పుడే తాము కాంగ్రెసు కోసం సక్రమంగా పని చేయగలమని వారు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమైన కాంగ్రెసు జిల్లా నాయకులు అదే మాట చెప్పారు. కాంగ్రెసు జిల్లా నాయకులతో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా గురువారం రాత్రి సమావేశమవుతున్నారు. డిఎస్‌తోనూ వారు అదే మాట చెప్పే అవకాశాలున్నాయి.

కడప పార్లమెంటు సీటుకు, పులివెందుల శాసనసభా స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై వేటు వేయాల్సిందేనని కాంగ్రెసు శాసనసభ్యుడు వీరశివా రెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారు. వారిపై చర్యలు తీసుకుంటేనే ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తామని కూడా ఆయన అంటున్నారు. చర్యలు తీసుకోవడం వల్ల తలెత్తే పరిణామాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డి శ్రీనివాస్ ఆలోచిస్తున్నారు. చర్యలు తీసుకోనంత వరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఏ విధమైన ప్రభావం పడదు. కడప జిల్లాకు చెందిన నలుగురైదుగురు శాసనసభ్యులపైన చర్యలు తీసుకున్నా పరిణామాలు ఎటు దారి తీస్తాయోననే ఆందోళనలో కాంగ్రెసు నాయకత్వం ఉంది.

జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు కూడా కాంగ్రెసు నాయకత్వానికి సవాల్ విసురుతున్నారు. తమపై సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి గురువారం అన్నారు. చర్యలు తీసుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి తగిన వ్యూహరచన చేస్తారా అనే సందేహం ఆయన ప్రకటనను బట్టి వ్యక్తమవుతోంది. కడప జిల్లాకు చెందిన కమలమ్మ, శ్రీనివాసులు, ఆదినారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిపై చర్యలు తీసుకునే ఆలోచనలో కాంగ్రెసు నాయకత్వం ఉన్నట్లు కూడా ప్రచారం సాగుతోంది.

English summary
Pressure on Congress leadership to take action against YS Jagan camp MLAs is increasing from Kadapa district leaders. Congress MLA Veerashiva Reddy is clearly asking for action against YS Jagan camp MLAs before by polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X