జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలతో వల్లభనేని వంశీ మంతనాలు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నారు. దాంతో చంద్రబాబు వచ్చే వరకు రాజీనామా చేయవద్దని జూనియర్ ఎన్టీఆర్, హరిష్మ నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అంత దాకా ఆగడానికి వంశీ నిరాకరిస్తున్నట్లు సమాచారం. వల్లభనేని వంశీ నందమూరి హరికృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితులనే విషయం తెలిసిందే.
కృష్ణా జిల్లా పర్యటనలో హరికృష్ణకు అవమానం జరిగిందని, కృష్ణా జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావు అందుకు కారణమని విమర్శిస్తూ వంశీ రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. తాను నగర పార్టీ అధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, పార్టీకి చేయడం లేదని వంశీ చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు వంశీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన రాజీనామా విషయాన్ని ప్రకటించాలని ఆయన నిర్ణయించుకున్నారు.