పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతోనే తేల్చుకుంటా: నాగం జనార్దన్ రెడ్డి

తెలంగాణ ప్రాంతంతో ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి రాయలసీమను పోల్చడాన్ని ఆయన తప్పు పట్టారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణవాసులు దురభిప్రాయంతో ఉన్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనడాన్ని ఆయన వ్యతిరేకించారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా బాబ్లీ ప్రాజెక్టు నిర్మిస్తుంటే గత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి నిర్లక్ష్యం వహించారని, ఈ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాబ్లీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్తారేమోనని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తాము ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామని ఆయన చెప్పారు.