కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడపకు చేరుకున్న వైయస్ జగన్, ఉప ఎన్నికల పోరుపై కసరత్తు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ శనివారం ఉదయం కడపకు చేరుకున్నారు. కడప పార్లమెంటు సీటుకు, పులివెందుల శాసనసభా స్థానానికి జరిగే ఉప ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించారు. ఉప ఎన్నికల పోరు ముగిసే వరకు ఆయన కడపలోనే మకాం వేయనున్నారు. ఈ ఉప ఎన్నికలు వైయస్ జగన్ రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేయనున్నాయి. అందుకే, ఈ ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఒకవేళ అనూహ్య పరిస్థితిలో ఓటమి చవి చూస్తే తన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందనే విషయం జగన్‌కు తెలుసు. అందుకే, ఉప ఎన్నికలపై ఏ విధమైన అలసత్వం ప్రదర్శించకూడదని ఆయన అనుకుంటున్నారు.

మితిమీరిన విశ్వాసం కూడా పని రాదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అవతలి వైపు తన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి ఉండడంతో ఎన్నికలపై తీవ్రంగానే కసరత్తు చేయాల్సి ఉంటుందని ఆయన అనుకుంటున్నారు. కాంగ్రెసు, తమ మధ్య పోరులో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందకుండా చూడాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. కడప పార్లమెంటు నియోజకవర్గంలోని శాసనసభా సెగ్మెంట్ల ఇంచార్జీలను అన్వేషించడంలో ఆయన మునిగిపోయారు. తన వర్గానికి చెందిన కొంత మంది శాసనసభ్యులు ఆయనను కలిశారు. కడప పార్లమెంటు సీటు నుంచి జగన్, పులివెందుల శాసనసభా స్థానం నుంచి వైయస్ విజయమ్మ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

English summary
YSR Congress leader YS Jagan reached Kadapa to chalk out strategy to be adapted in Kadapa loksabha and Pulivendula assembly segment bypolls. He is very keen in winning both the seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X