హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వ్యాఖ్యలపై కె కేశవరావు ధ్వజం

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Keshava Rao
హైదరాబాద్: తెలంగాణ కంటే రాయలసీమ వెనుకపడిందన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు కె కేశవరావు ఆదివారం అన్నారు. కరీంనగర్ కన్నా చిత్తూరు వెనుకబడి ఉందని చెప్పడం సరికాదని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. విధాన సభలోనే సాక్షాత్తు మంత్రి ఓ శాసనసభ్యునిపై దాడి చేస్తే క్షమాపణలతో సరిపెట్టడం వదిలేశారని ఆరోపించారు.

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణపై రహస్య నివేదిక ఇవ్వడం నీచాది నీచం అని వ్యాఖ్యానించారు. శ్రీకృష్ణ కమిటీని తాము గుర్తించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రహస్య నివేదిక ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. నేతలను ప్రలోభ పెట్టమని ఓ కమిటీ చెప్పడం దురదృష్టకరమన్నారు. ఆదివారం తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు హైదరాబాదులో సమావేశం అయి తెలంగాణపై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించారు. అనంతరం కెకె విలేకరులతో మాట్లాడారు.

జూపల్లి కృష్ణారావు తన రాజీనామాను ఉపసంహరించుకోవాలని కెకె కోరారు. మే నెల తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని అప్పుడు తెలంగాణకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మే నెల తర్వాత తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

English summary
Congress Party senior leader K Keshava Rao oppossed CM Kirankumar Reddy comments on Telangana. He also blamed Srikrishna Committee 8th chapter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X