జూన్‌లో రాజకీయ సంక్షోభం, ప్రభుతానికి ఢోకా లేదు: పంచాంగ కర్తలు

ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడుతాయని సుబ్రహ్మణ్మ శర్మ చెప్పారు. ప్రజలకు ప్రభుత్వాలు మంచి పాలన అందిస్తాయని చెప్పారు. పంటలు కూడా బాగానే పండుతాయని ఆయన చెప్పారు. ఆర్థికంగా రాష్ట్రానికి ఇబ్బందులు తప్పవని, అయితే ఆ ఇబ్బందులను ప్రభుత్వం అధిగమిస్తుందని ఆయన అన్నారు. జూన్ 5వ తేదీ నుంచి ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని చెప్పారు.
కాగా, తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం ప్రజలకు సంతోషం కలగాలని ఆయన ఆశించారు. అన్ని రంగాల్లో ప్రజలు ప్రగతి సాధించాలని ఆయన అన్నారు. మన కళలు, సంప్రదాయాలను కాపాడుకునే విధంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. వృద్ధకళాకారులకు తాము ఇప్పటికే సహాయం అందిస్తున్నామని చెప్పారు. ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాను గౌరవించేలా ఓ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన చెప్పారు.