హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌ను వదలిపెట్టని విహెచ్, దురుసుతనమని వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

V Hanumanth Rao
హైదరాబాద్ : వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు వైయస్ జగన్‌ను కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంత రావు వదలిపెట్టడం లేదు. పులివెందుల, కడప ఉప ఎన్నికలు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి మధ్య సమరమని వైయస్ జగన్ ఆదివారంనాడు కడప జిల్లాలో చేసిన వ్యాఖ్యలపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మండిపడ్డారు. అటువంటి వ్యాఖ్యలు చేసిన వైయస్ జగన్ అవివేకి అని ఆయన అన్నారు. ఆ వ్యాఖ్యలు వైయస్ జగన్ దురుసుతనానికి నిదర్శమని అభిప్రాయపడ్డారు.

సోనియాను, రాజీవ్ గాంధీని వైయస్ రాజశేఖర రెడ్డి గౌరవించేవారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని దోపిడీదారుడని తాను ఏనాడూ అనలేదని ఆయన స్పష్టం చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి కష్టపడి పదవి తెచ్చుకుంటే వైయస్ జగన్ వైయస్ మరణంతో పదవి సాధించాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు పార్టీకే కట్టుబడి ఉండేవారని ఆయన అన్నారు.

వైయస్ జగన్ వ్యాఖ్యలపై ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా మండిపడ్డారు. వైయస్ జగన్ వ్యాఖ్యలు అర్థరహితమని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మ ఎక్కడున్నా కాంగ్రెసు అభ్యర్థులు గెలవాలనే కోరుకుంటుందని ఆయన అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికే వైయస్ జగన్ ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి చివరి క్షణం వరకు సోనియా నాయకత్వంతోనే ఉన్నారని ఆయన చెప్పారు. పులివెందుల, కడప అభ్యర్థుల ఎంపికపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు.

English summary
Congress leader V Hanumanth rao lashed out at YSR Congress party leader YS Jagan comments on Sonia Gandhi. PCC president D Sriniavas also condemned YS Jagan's comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X