హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరణించాక ఎంతోమందిని ప్రజలు మర్చిపోతారు: చంద్రబాబునాయుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: మరణించిన తర్వాత ఎంతోమంది నాయకులను ప్రజలు మర్చిపోతారని కానీ బాబూ జగ్జీవన్ రామ్‌ను మాత్రం తమ గుండెల్లో ప్రజలు నిలుపుకున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మంగళవారం అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా చంద్రబాబు ఆయన ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. షెడ్యూల్డు కులాలకు ఎనలేని కృషి చేసింది తెలుగుదేశం పార్టీ అన్నారు. ఎస్సీలకు ఇప్పటికీ భూములు లేవని వారికి కొన్ని హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఎస్సీ విద్యార్థులందరికీ సరియైన విద్యను అందించడానికి గురుకుల పాఠశాలలు మరిన్ని ఏర్పాటు చేసి ప్రోత్సహించాలన్నారు. ఎస్సీ ఫైనాన్సు కార్పోరేషన్‌లో డబ్బులు లేని పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం ఎస్సీలను, ఎస్టీలను విస్మరిస్తోందన్నారు. వారి కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులను కూడా ఖర్చు పెట్టడం లేదన్నారు. ఇప్పటికీ దళితులు అంటరానివారిగా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి ఏర్పాటు చేసిన జస్టిస్ పున్నయ్య కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన కమిటీ కోసం చైర్మన్‌ను కూడా నియమించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.

ఎస్సీల అభివృద్ధికి టిడిపి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో ప్రప్రథమంగా దళితులకు అందలం ఎక్కించిన ఘనత టిడిపిది అన్నారు. చీఫ్ సెక్రటరిగా మాధవరావు, శాసనసభ స్పీకరుగా ప్రతిభా పాటిల్, పార్లమెంటు స్పీకరుగా బాలయోగి వంటి దళితులను చేయడంలో టిడిపి ముందు ఉందన్నారు. దళితులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

English summary
TDP president Chandrababu Naidu said that congress government neglects SCs. He prayed Jagjivan Ram in NTR Trust Bhavan. He said public will forget someany leaders after death but Jagjivan is in people heart.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X