చంద్రబాబుకు అవమానం ఎక్కువ, రాజ్యపూజ్యం తక్కువ: హరీష్

పంచాంగ కర్తలతో కూడా చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆయన విమర్శించారు. వచ్చే ఉగాదిని కూడా సమైక్యాంధ్రలోనే చేసుకుంటామని పంచాంగ కర్త గార్గేయ చెప్పడంపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యనించారు. చంద్రబాబు మనస్సులోని మాటను గ్రహించి గార్గేయ ఆ విధంగా చెప్పారని ఆయన అన్నారు. 2009లో చంద్రబాబు అధికారంలోకి వస్తారని గార్గేయ గతంలో చెప్పారని, అది పగటి కలగానే మిగిలిపోయిందని, సమైక్యాంధ్ర కూడా పగటి కలగానే మిగులుతుందని ఆయన అన్నారు. చంద్రబాబును సంతోషపెట్టడానికే గార్గేయ ఆ విధంగా చెప్పారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications