పిల్లి తుమ్మినా, ఎలుక దగ్గినా చంద్రబాబే కారణం అంటారు: నన్నపనేని
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: రాష్ట్రంలో పిల్లి తుమ్మినా, ఎలుక దగ్గినా కూడా దానికి కారణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడే అని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు అంటారని టిడిపి సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి మంగళవారం అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్న పంచాంగ శ్రవణంపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలను ఆమె ఆక్షేపించారు. ప్రతి చిన్న విషయానికి అధికారంలో ఉన్న కాంగ్రెసును కాదని టిడిపిని విమర్శించడం టిఆర్ఎస్‌కు మామూలే అన్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పంచాంగ కర్త చెప్పిన అంశాన్ని వివాదం చేయాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. కాగా భగవాన్ సత్యసాయి బాబా ఆరోగ్యంపై కూడా ఆమె స్పందించారు. బాబా కలకాలం ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. తన ఆయుష్షు కూడా పోసుకొని బాబా కలకాలం జీవించాలని ఆమె అన్నారు.
TDP senior leader Nannapaneni Rajakumari blamed TRS comments on panchanga sravanam. She said TRS target is not government but TDP. She hoped that Baba health will cure soon.
Story first published: Tuesday, April 5, 2011, 13:58 [IST]