వైయస్ జగన్‌ను తెలంగాణ వ్యతిరేకిగానే చూస్తున్నాం: కోదండరామ్
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ పట్ల తమ వైఖరి మారలేదని, జగన్‌ను తెలంగాణ వ్యతిరేకిగా చూస్తున్నామని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. వైయస్ జగన్‌కు సహకరించడమంటే తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లేనని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్ వెంట తిరగడమంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు భిన్నంగా వ్యవహరించడమేనని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణ జెఎసి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రేపటి నుంచి ఉద్యమ భవిష్యత్తుపై దృష్టి సారిస్తామని, జిల్లా స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
ఈనెల 20వ తేదీ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయనున్నట్లు కోదండరాం తెలిపారు. ఈ దఫా ఉద్యమం కేంద్రంపైన, రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలే లక్ష్యంగా ఉంటుందని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా తాము వెనక్కి తగ్గలేదని, ఎన్నికల సందర్భంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం తమ వ్యూహమన్నారు. ఈనెల 11వ తేదీనుంచి తెలంగాణ పది జిల్లాల్లో శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదవ అధ్యాయంపై ప్రచార ఉద్యమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు.
Telangana political JAC chairman Kodandaram clarified that JAC stand on YS Hagan has not changed. He said that he is considering YS Jagan as anti Telangana leader.
Story first published: Tuesday, April 5, 2011, 14:25 [IST]