వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుట్టపర్తి సత్య సాయిబాబాకు వారసుడే లేడా, ప్రకటించని ట్రస్టు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Saibaba
అనంతపురం: ప్రశాంతి నిలయాన్ని, దాని కార్యకలాపాలను పుట్టపర్తి సత్య సాయిబాబా తర్వాత ముందుకు నడిపించేదెవరనే ప్రశ్న ఉదయిస్తోంది. సత్య సాయిబాబాకు వారసుడే లేడని అంటున్నారు. నాలుగేళ్ల క్రితం సత్య సాయిబాబా ఆరోగ్యం దెబ్బ తిన్నప్పుడే ఆయన వారసుడిపై చర్చ జరిగింది. అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతున్న పుట్టపర్తే దాని ప్రధాన కేంద్రం కానుందనే వార్తలు వస్తున్నాయి. సాయిబాబా 1963 జులై 6వ తేదీన గురు పూర్ణిమ సందర్భంగా తన ఆధ్యాత్మిక రహస్యాన్ని వెల్లడించారు. శివ - శక్తి సూత్రానికి సంబందించిన ముగ్గురి అవతారమని ఆయన చెప్పుకున్నారు. శ్రీ సత్య సాయిబాబా శివుడు, పార్వతి, కర్ణాటకలోని మాండ్యాలో గల ప్రేమ సాయిల అవతారంగా తనను ఆయన చెప్పుకున్నారు.

చిన్నప్పుడు తాను రాసిన పాటల్లో కూడా సత్య సాయి షిర్డీ సాధువును ఉటంకిస్తూ వస్తున్నారు. తాను 8 ఏళ్ల తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీలో తాను తిరిగి జన్మిస్తానని షిర్డీ సాయిబాబా తన మరణానికి ముందు 1918లో ప్రకటించాడు. సత్యసాయిబాబా 1926లో జన్మించారు. తనను షిర్డీ బాబాగా ప్రకటించుకున్నారు. గత జన్మలో తాను షిర్డీ సాయిబాబానని ఆయన తర్వాత ప్రకటించుకున్నారు. తాను మాండ్యాలో ప్రేమ సాయిగా పుడుతానని సత్యసాయి బాబా తన ప్రవచనాల సందర్భంగా చెప్పేవారు. కానీ ఇప్పటి వరకు సత్యసాయి ట్రస్టు ఆయన వారసుడిని ప్రకటించలేదు. సత్యసాయి వారసుడిని ప్రకటించే కార్యక్రమానికి సత్యసాయి ట్రస్టు స్వస్తి చెప్పినట్లు సమాచారం. సత్యసాయి బాబా సోదరుడు జానకీ రామ్ కుమారుడు రత్నాకర్ సత్య సాయి ట్రస్టులో శక్తివంతుడైన సభ్యుడు.

English summary
While questions were doing the rounds about the future of the international spiritual centre ever since Saibaba fell sick four years back, ashram sources said Puttaparthi would continue as a major spiritual centre and as second Shirdi' in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X