హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ దూకుడు: అభ్యర్థుల ఎంపికలోనే కాంగ్రెసు, టిడిపి సతమతం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయడానికే మల్లగుల్లాలు పడుతుంటే వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు వైయస్ జగన్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. పులివెందుల శాసనసభా స్థానానికి, కడప లోకసభ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో విజయానికి జగన్ ఇప్పటికే తన వ్యూహాన్ని ఖరారు చేశారు. రేపు బుధవారం నుంచి జగన్ ప్రచారంలోకి దూకుతున్నారు. ఆయన తల్లి, పులివెందుల అభ్యర్థి వైయస్ విజయమ్మ ఎల్లుండి గురువారం నుంచి ప్రచారంలో పాల్గొంటారు. కడప లోకసభ స్థానంలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించేందుకు కూడా ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను మట్టి కరిపించేందుకు జగన్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు.

అభ్యర్థుల ఎంపిక కోసం, ప్రచార వ్యూహ రచన కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళవారం ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్లో కడపజిల్లా నేతలతో సమావేశమయ్యారు. కడప, పులివెందుల అభ్యర్థులపై కసరత్తుచేశారు. కాంగ్రెస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులను దీటుగా ఎదుర్కోగల అభ్యర్థులకోసం చంద్రబాబు అన్వేషిస్తున్నారు. లోక్‌సభ సీటుకు కందుల రాజమోహన్‌రెడ్డి, శివానందరెడ్డి, రామసుబ్బారెడ్డి, పుట్టా నరసింహారెడ్డి, మైసూరారెడ్డి పేర్లు పరిశీలిస్తుండగా, పులివెందుల నియోజకవర్గానికి బీటెక్‌ రవి, ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి భార్య సుమతి, సతీష్‌రెడ్డి సోదరి భాగ్యమ్మ పేర్లు పరిశీలిస్తున్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన కందుల సోదరుల్లో ఒకరిని గానీ, మైసూరారెడ్డిని గానీ కడప లోక్‌సభ అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశముంది. నేడో రేపో చంద్రబాబు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనున్నారు.

కాగా, అభ్యర్థుల ఖరారు కోసం కాంగ్రెసు నాయకులు కుస్తీ పడుతున్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. పులివెందుల నుంచి వైయస్ వివేకానంద రెడ్డిని, కడప పార్లమెంటు సీటు నుంచి ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని పోటీకి దించాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.

English summary
YSR Congress party leader YS Jagan wants to take advanatage in Kadapa and Pulivendula bypolls. Congress and TDP are yet to decide candidates, YS Jagan is beginning his compaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X