వైయస్ జగన్‌పై పోటీకి డిఎల్ రవీంద్రా రెడ్డిపై పెరుగుతున్న ఒత్తిడి

వరద రాజులు రెడ్డితో పాటు జగన్‌పై పోటీ పెట్టేందుకు ఇతర ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచిస్తున్నారు. కందుల రాజమోహన్ రెడ్డి పేరు కూడా పరిశీలించే అవకాశం ఉంది. కందుల రాజమోహన్ రెడ్డి తన సోదరుడు కందుల శివానందరెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. కందుల రాజమోహన్ రెడ్డి జగన్‌పై గట్టి అభ్యర్థే అవుతారని భావిస్తున్నారు. గతంలో కడప లోకసభ స్థానంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై ఆయన కేవలం ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ రీత్యా జగన్‌ను కందుల రాజమోహన్ రెడ్డి దీటుగా ఎదుర్కోగలరని భావిస్తున్నారు.