Hardik Pandya: హార్దిక్ కు MI సహకరించట్లేదా ? బాంబుపేల్చిన మాజీ..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో అత్యంత చెత్త ప్రదర్శనతో టోర్నీ నుంచి దాదాపు నిష్కృమించిన ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా (Hardik Pandya)..అంతకంటే ఎక్కువ విమర్శలే ఎదుర్కొంటున్నాడు. కెప్టెన్ గా, బ్యాటర్ గా, బౌలర్ గా విఫలమవుతున్న హార్దిక్ పాండ్యా వల్లే జట్టు ఇలాంటి పరిస్ధితుల్లో ఉందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అయితే హార్దిక్ సొంత వైఫల్యం ఓ ఎత్తు, జట్టు నుంచి అందని సహకారం మరో ఎత్తని భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ వెల్లడించాడు.

IPL 2026: బుమ్రా కొనసాగింపుపై తేల్చేసిన పొల్లార్డ్..! నెక్ట్స్ మ్యాచ్ ల్లో..!
IPL 2026: బుమ్రా కొనసాగింపుపై తేల్చేసిన పొల్లార్డ్..! నెక్ట్స్ మ్యాచ్ ల్లో..!

తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయి, ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తమ ఏడో ఓటమిని చవిచూసిన తర్వాత, హార్దిక్ విమర్శల నుండి తప్పించుకోవడం కష్టంగా మారింది. అయితే ఈ సీజన్‌లో ముంబై పేలవ ప్రదర్శనకు ప్రధాన కారణంగా హార్దిక్‌ను ముద్ర వేయడం సరికాదని భారత మాజీ బ్యాటర్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే, అతను కోరుకున్న స్థాయిలో సహచర ఆటగాళ్ల నుండి అతనికి మద్దతు లభించలేదని అన్నాడు. క్రిక్‌బజ్‌లో మాట్లాడుతూ తివారీ.. ముంబై ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పటికే ముగిసిపోయిందని తేల్చేశాడు.

Hardik Pandya Left Isolated Mumbai Indians Faces Backlash Over Lack of Support
IPL 2026: అభిషేక్ కు బిగ్ టెన్షన్..! భారీ రికార్డుకు బుడ్డోడి ముప్పు ?
IPL 2026: అభిషేక్ కు బిగ్ టెన్షన్..! భారీ రికార్డుకు బుడ్డోడి ముప్పు ?

జట్టు వైఫల్యాల నిందలను భరించాల్సి వచ్చినప్పుడు, ఇతరుల నుండి ఎలాంటి మద్దతు లేకుండా ముంబై కెప్టెన్ ఇంతకాలం ఒంటరిగా నిలబడాల్సి వచ్చిందని మనోజ్ తివారీ తెలిపాడు.ఒక కెప్టెన్ ప్రతి ఆటగాడి నమ్మకాన్ని గెలుచుకోవాలని, అతను ఒక నాయకుడిగా ఉండాలని, అయితే, హార్దిక్‌కు ఎవరూ అండగా నిలబడటం లేదనిపిస్తోందన్నాడు. అతనికి అవసరమైన మద్దతు అస్సలు లేదన్నాడు. కెప్టెన్‌కు ఒక పాత్ర ఉందని, కానీ అతను సరిగ్గా ఆడటం లేదన్నాడు. కానీ అంతకు మించి, ఇతర ఆటగాళ్లు బాధ్యత తీసుకోవాలన్నాడు. ఉదాహరణకు సూర్య నిలకడగా రాణించడం లేదని, తిలక్ ఒక మంచి మ్యాచ్ తర్వాత తన ఫామ్‌ను కొనసాగించలేదని గుర్తుచేశాడు. జట్టు నుండి ఇటువంటి నిలకడలేని ప్రదర్శనతో, మీరు ఫలితాలను ఎలా రాబట్టగలరని తివారీ ప్రశ్నించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+