ప్రతి భారతీయుడి రోమాలు నిక్కపొడిచే సినిమా అన్నా..!!
దేశభక్తి సినిమాలకు మనదేశంలో ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. బ్రిటిష్ సామ్రాజ్యం, ముస్లిం రాజ్యాలు మన దేశాన్ని వందల ఏళ్లపాటు పరిపాలించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారి అక్రమాలకు, అన్యాయాలకు ఎదురు తిరిగిన దేశ పౌరులను చిత్ర హింసలు పెట్టి హతమార్చిన సంఘటనలు ఎన్నో.. అలా బ్రిటీష్ ప్రభుత్వాన్ని, ముస్లిం రాజ్యాల్ని ఎదిరించిన నిలిచి ప్రాణాలు కోల్పోయిన స్వాతంత్ర్య సమరయోధులు ఎంతోమంది.. వారికి మనకు తెలిసినవాళ్లు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అలాంటి స్వాతంత్ర్య సమర యోధుల్లో మొదటగా చెప్పుకోవాల్సింది ఛత్రపతి శివాజీ మహరాజ్.. భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన పాలకుడిగా శివాజీ పేరుగాంచారు. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప యోధుడు శివాజీ. అలాంటి యోధుడి మీద ఇప్పటివరకూ చాలా సినిమాలు వచ్చాయి.
అయితే ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'రాజా శివాజీ'.. మే 1 వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. మొదటి రోజున రూ. 11.35 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం మరాఠీ వెర్షన్ కు మంచి స్పందన లభిస్తోంది. ఇక రెండు రోజుల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా 'రాజా శివాజీ' రూ. 26.06 కోట్లు నమోదు చేసినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో మెరిశారు.

ఈ మూవీని బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే ఎక్కడా రాజీ పడకుండా రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ మూవీ మరాఠీలో అత్యధిక వసూళ్లు సాధించిన సైరత్ రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. రితేష్ దేశ్ ముఖ్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం 'రాజా శివాజీ'.. అతను గతంలో అతను జెనీలియా, జియా శంకర్ నటించిన మరాఠీ చిత్రం 'వేద' తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదే మూవీపై తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోస్టు పెట్టారు. రాజా శివాజీ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించినందుకు చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications