సుప్రీంలో జగన్‌కు మళ్లీ చుక్కెదురు: కామన్ సింబల్‌పై ఈసీదే నిర్ణయం

పార్టీ అభిప్రాయాన్ని పరిగణలోనికి తీసుకోవాలని సూచించగలమని చెప్పింది. అయితే పార్టీకి కామన్ సింబల్ కేటాయించడంలో తుది నిర్ణయం మాత్రం ఈసీదేనని చెప్పింది. రెండోసారి కూడా తమకు కోర్టులో చుక్కెదురు కావడంతో జగన్ వర్గం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఇది వరకు కూడా కామన్ సింబల్ కోసం జగన్ సుప్రీం కోర్టుకు వెళ్లారు. అప్పుడు కూడా కోర్టు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే జగన్ మాత్రం రెండోసారి కోర్టుకు వెళ్లారు. రెండోసారి కూడా ఎదురు గాలి వీచింది.
త్వరలో కడప పార్లమెంటుకు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జగన్ సుప్రీం కోర్టుకు వెళ్లి కామన్ సింబల్‌ను తెచ్చుకొని అదే సింబల్‌పై ఎన్నికల బరిలోకి దిగాలని యోచించారు. ఉప ఎన్నికలలో తన తల్లి విజయమ్మ, తాను ఒకే గుర్తుపై పోటీ చేస్తే కలిసి వస్తుందని జగన్ భావించారు. కానీ సుప్రీంలో చుక్కెదురు కావడంతో ఇప్పుడు ఎన్నికలకు ఈసీ ఇచ్చే గుర్తులపై వెళ్లే అవకాశం ఉంది. అయితే సుప్రీం సూచనల మేరకు ఈసీ పరిశీలించే అవకాశం కూడా లేక పోలేదు.












Click it and Unblock the Notifications