వైయస్ జగన్‌ను ధీటుగా ఎదుర్కొంటాం: ఎమ్మెల్యే వీరశివా రెడ్డి

ఉప ఎన్నికలలో పోటీకి అధిష్టానం ఎంపిక చేసిన అభ్యర్థినే తామంతా బలపరుస్తామని చెప్పారు. అధిష్టానం ఎంపిక చేసిన వ్యక్తి బరిలోకి దిగుతారని చెప్పారు. అధిష్టానం సూచించిన వ్యక్తికి తామంతా బాసటగా నిలబడి గెలుపుకు కృషి చేస్తామని చెప్పారు. జగన్‌పై పోటీకి మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సరియైన వ్యక్తి అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే డిఎల్‌పై తాను ఒత్తిడి తీసుకు వస్తున్నట్టుగా చెప్పారు. తన పేరును కూడా కొందరు ప్రతిపాదిస్తున్నారని, అయితే అధిష్టానం ఎవరిని సూచిస్తే వారు బరిలోకి దిగుతారని చెప్పారు.