టిడిపి విభేదాలతో మాకు సంబంధం లేదు: పురందేశ్వరి భర్త దగ్గుపాటి

కాగా గురువారం ఓ పత్రికలో తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు సాగుతుందని దానికి కారణం పురందేశ్వరి అని వచ్చిన విషయం తెలిసిందే. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు, ఎంపీ హరికష్ణకు మధ్యన మళ్లీ విభేదాలు పొడసూపుతున్నాయని అందులో వచ్చింది. నందమూరి వంశం చంద్రబాబుతో విభేదిస్తున్నదని, అయితే హరికృష్ణ బయట పడుతున్నప్పటికీ బాలకృష్ణ మొహమాటస్తుడు కావడం వల్ల వివాదాలకు దూరంగా ఉంటున్నారని వార్త ప్రచురించింది. హరికృష్ణను పురందేశ్వరి ముఖ్యమంత్రి పదవి కోసం వెనుక ఉండి నడిపిస్తుందని ఆరోపించింది. విజయవాడలో ఇటీవల చోటు చేసుకున్న విభేదాలు కూడా అందులో భాగమేనని చెప్పింది.
Comments
daggubati venkateswara rao purandeswari chandrababu naidu telugudesam hyderabad పురందేశ్వరి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం హైదరాబాద్
English summary
Central Minister Purandeswari husband Daggupati Venkateswara Rao confirmed that thy have no link with TDP differences. He said they have satisfied with their posts.
Story first published: Thursday, April 7, 2011, 15:49 [IST]