చంద్రబాబుపై వార్: ప్రజల ముందుకు వస్తానంటూ హరికృష్ణ వెల్లడి

అవినీతికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టిన స్వర్గీయ ఎన్టీ రామారావు ఆశయ సాధనకు త్వరలో ప్రజల ముందుకు వస్తానని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు, అవినీతి నిర్మూలనకు త్వరలో మీ ముందుకు వస్తాను, ఆశీర్వదించండి అంటూ హరికృష్ణ విజ్ఞప్తి చేశారు. హరికృష్ణ విడుదల చేసిన ప్రకటనలో చంద్రబాబు ప్రస్తావన గానీ గత కొంత కాలంగా రాష్ట్రంలోని అవినీతిపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆందోళన వివరాలు గానీ లేవు. ఎన్టీఆర్ ఆశయాల పరిరక్షక వారసుడిగా గుర్తు చేస్తున్నానని, అవినీతిపై తొలుత యుద్ధం ప్రకటించిన నేత ఎన్టీ రామారావు అని, అవినీతి నిర్మూలనకు ఎన్టీ రామారావు రామారెడ్డి ధర్మ మహాపాత్రగా నియమించారని ఆయన అన్నారు. లోకాయుక్త, ఉప లోకాయుక్తలను కూడా ఎన్టీ రామారావే ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు.
హరికృష్ణ విడుదల చేసిన ఆ ప్రకటనను చూస్తుంటే తెలుగుదేశంలో నడుస్తున్న ప్రచ్ఛన్న యుద్ధం వాస్తవమేనని తేలిపోతోంది. నందమూరి కుటుంబ సభ్యులు చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవుతున్నారని, తెలుగుదేశం పార్టీని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న హరికృష్ణ పార్టీలో అంతర్గత పోరుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications