వైయస్ జగన్ ఇష్యూ: శంకర రావు ప్రకటనపై దానం నాగేందర్ ఆగ్రహం

Danam Nagender
హైదరాబాద్: తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశించడం వల్లనే తాము మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌పై కేసు పెట్టినట్లు రాష్ట్ర చేనేత మంత్రి పి. శంకర రావు చేసిన ప్రకటనపై మంత్రి దానం నాగేందర్ మండిపడ్డారు. సోనియా ఆదేశించడం వల్లనే జగన్‌పై కేసు పెట్టినట్లు శంకర రావు చేసిన ప్రకటనలో నిజం లేదని ఆయన అన్నారు. శంకర రావు ప్రకటన అభ్యంతరకరంగా ఉందని ఆయన అన్నారు.

కాంగ్రెసు విద్యార్థి అనుబంధ సంఘం ఎన్ఎస్‌యుఐ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న దానం నాగేందర్ శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైయస్ జగన్ వ్యవహారాల్లోకి సోనియా గాంధీని లాగడం సరి కాదని ఆయన అన్నారు. ఉన్నతమైన పదవిలో బాధ్యతారహితంగా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. చిన్న విషయాల్లోకి సోనియా గాంధీని లాగడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

కడప, పులివెందులలో జరగబోయే ఉప ఎన్నికలు సోనియా, వైఎస్‌ఆర్‌లకు మధ్య పోటీ కాదని 20 సూత్రాల అమలు కమిటీ అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. ఇది బెంగుళూరు, పులివెందుల మధ్యే పోటీ అన్నారు. జగన్‌ ఎప్పుడూ బెంగుళూరులోనే ఉంటారు, వివేకా పులివెందుల్లోనే ఉంటారని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+