బాలకృష్ణపై జూ ఎన్టీఆర్ అసంతృప్తి, నారా లోకేష్‌పై ఆగ్రహం

తనను వివాదాల్లోకి లాగవద్దని బాలకృష్ణ అనడం ఎంత వరకు సమంజసమని జూనియర్ ఎన్టీఆర్ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌పై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలుగుదేశం నాయకుడు వల్లభనేని వంశీ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఉమా మహేశ్వర రావుపై చేసిన విమర్శల నేపథ్యంలో చంద్రబాబు ఫోన్ చేస్తే తాను స్పందించలేదనే సమాచారాన్ని మీడియాకు వెల్లడించడంపై నారా లోకేష్‌ను ఆయన తప్పు పడుతున్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ తాను ఒక్కరే ప్రకటన విడుదల చేయడం కాకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ తర్వాత మీడియాకు వెళ్తే బాగుండేదని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడినట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ అసంతృప్తి చెందినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.