ఈ ఉప ఎన్నికలతో కాంగ్రెసు పతనం ప్రారంభమైంది: వైయస్ జగన్

YS Jagan
కడప: కడప లోకసభ, పులివెందుల శాసనభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలతో కాంగ్రెసు పతనం ప్రారంభమైందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు, కడప లోకసభ అభ్యర్థి వైయస్ జగన్ అన్నారు. కడప లోకసభ స్థానంలో తాను చేస్తున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన ఆ మాటలన్నారు. కాంగ్రెసు పార్టీపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ ఉప ఎన్నికలు ముమ్మాటికీ వంద శాతం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాకు, వైయస్ రాజశేఖర రెడ్డికి మధ్య జరుగుతున్నవేనని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల కుట్రను ప్రజలు తిప్పికొడతారని ఆయన అన్నారు.

కాగా, వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు మంగళవారం ఎన్నికల కమిషన్ అధికారి దక్షిణామూర్తిని కలుసుకున్నారు. వైయస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెసు కడప లోకసభ అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వైయస్సార్ కాంగ్రెసు తరఫున నామినేషన్ వేసిన మహబూబ్ బాషాపై కూడా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కడప లోకసభ నియోజకవర్గంలో పోలీసులకు పట్టుబడిన 82 లక్షల రూపాయలు కాంగ్రెసు పార్టీకి చెందినవేనని వారు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+